నైజాంలో కాంతారా ను విడుదల చేసేది వీళ్లే..!

కాంతార 1 సినిమా కోసం ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో, ఆయననే హీరోగా తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌కి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా నిర్ణీత సమయానికి థియేటర్లలోకి రానుంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రాండ్ రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నైజాం హక్కులు మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు దక్కించుకుని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మార్కెట్‌లో సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories