అక్కినేని అఖిల్ కొత్తగా చేస్తున్న సినిమా లెనిన్ గురించి వరుసగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని అంటున్నారు. ఆయన రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేస్తాయని సమాచారం.
ఇంకా తాజాగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ సిస్టర్ పాత్ర కూడా ఉంటుందని, ఆ రోల్‌కి ఒక సీనియర్ నటి కనిపించబోతుందని అంటున్నారు. ఆ క్యారెక్టర్ సినిమాకి డిఫరెంట్ ఫీల్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.
సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. చిత్తూరు ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌గా ఈ కథను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. అఖిల్ డైలాగ్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతోందని సమాచారం.