పప్పీ షేమ్‌ సాంగ్‌ క్యాచీగా ఉంది..!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్తగా చేస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పటికే మంచి హైప్ సృష్టించింది. ఈ సినిమాను దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కిస్తుండగా, రామ్ ప్రత్యేకమైన లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

తాజాగా ఈ చిత్ర బృందం నుంచి రెండో పాటను విడుదల చేశారు. పప్పీ షేమ్ అనే ఈ పాటను స్వయంగా రామ్ గాత్రంతో రికార్డ్ చేయడం విశేషం. అంతకుముందు విడుదలైన మొదటి పాటలో రామ్ లిరిక్స్ రాశాడు. ఇప్పుడు ఈ రెండో పాటతో సింగర్‌గా కూడా తన టాలెంట్ చూపించాడు. భాస్కరభట్ల రాసిన పదాలకు వివేక్-మెర్విన్ జంట ఎనర్జీటిక్ ట్యూన్స్ ఇచ్చారు. ముఖ్యంగా కాలేజీ వాతావరణంలో వచ్చే ఈ సాంగ్‌లో రామ్ వేసిన స్టెప్స్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేలా ఉన్నాయి.

ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ పాత్రలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కనిపించనుండగా, ఆయనకు అభిమాని పాత్రలో రామ్ ఎంటర్‌టైన్ చేస్తాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories