టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అందులో “జాతి రత్నాలు” ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వుల వర్షంలో ముంచెత్తింది. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
కానీ ఈ సినిమా కథ మొదట్లో నవీన్‌కి కాకుండా ఇంకో యంగ్ హీరోకి వెళ్లిందనే ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకి వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు, “హను మాన్”తో సెన్సేషన్ సృష్టించిన తేజ సజ్జ. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ “మిరాయ్”తో రాబోతున్నాడు.
“జాతి రత్నాలు” స్క్రిప్ట్ మొదట తన దగ్గరకి వచ్చినప్పటికీ, చివరికి అది నవీన్‌కి వెళ్లిందని తేజ వెల్లడించాడు. అంతేకాదు, ఆ పాత్రను తనకంటే బాగా నవీన్ చేయగలడని కూడా చెప్పాడు.