తెలుగు సినిమాల్లో ఒక సమయంలో ఏకంగా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌నే డామినేట్ చేసింది. ఆ తరుణంలో బాలకృష్ణ సినిమాలే ఎక్కువగా హిట్ అయ్యాయి. సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవ రెడ్డి లాంటి చిత్రాలతో బాలయ్య బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. అదే సమయంలో చిరంజీవి కూడా ఇంద్ర సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేశారు. అప్పట్లో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక తాజాగా ఇంద్ర సినిమా సెట్స్‌లో తీసిన ఒక అరుదైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పిక్‌లో ఇంద్రసేన రెడ్డి లుక్‌లో ఉన్న చిరంజీవి, ఆయన పక్కనే బాలకృష్ణ, అలాగే నిర్మాత అశ్విని దత్ కనిపిస్తున్నారు.