సైమా వేదిక పై తగ్గేదేలే…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప-2 సినిమాకి థియేటర్స్‌లో ఎంత పెద్ద హైప్ వచ్చిందో అందరికీ తెలిసిందే. బన్నీ తన స్టైల్‌తో ఇచ్చిన పర్ఫార్మెన్స్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పటికీ తన ప్రభావం చూపిస్తూనే ఉంది.

ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025లో కూడా పుష్ప-2 దుమ్ము రేపింది. ఈ సినిమా ఒకేసారి ఐదు అవార్డులు దక్కించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ గెలవగా, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో సుకుమార్ విజేత అయ్యారు. హీరోయిన్ రష్మిక మందన్నా, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్లేబ్యాక్ సింగర్ మేల్ విభాగంలో శంకర్ బాబు కందుకూరి కూడా అవార్డులు అందుకున్నారు.

అవార్డ్స్ వేదికపై పుష్ప-2 టీమ్ తమదైన స్టైల్లో “తగ్గేదే లే” అటిట్యూడ్‌తో పోజులు ఇచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories