విజయం దిశగా లిటిల్‌ హార్ట్స్!

ఈ వారం థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ఒక చిన్న సినిమా “లిటిల్ హార్ట్స్”. భారీ చిత్రాలైన ఘాటి, మదరాసి లాంటి మూవీస్ తోపాటు రిలీజ్ అయినప్పటికీ, ఈ సినిమా టీం చేసిన ప్రమోషన్స్ బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల దృష్టి వీరి మీద పడింది.

రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమాకి మంచి టాక్ రావడం, పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం గమనార్హం. థియేటర్స్ లో హౌస్‌ఫుల్ షోలు పడుతుండటం తో సినిమా ఊహించిన దానికంటే బెటర్ రిజల్ట్ సాధిస్తున్నట్టే అనిపిస్తోంది.

బుకింగ్స్ కూడా బాగానే జరగడంతో ఈ వీకెండ్ కి “లిటిల్ హార్ట్స్” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సంపాదించే అవకాశం కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories