మిరాయ్‌ రన్‌ టైం ఎంతంటే..!

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన తాజా సినిమా మిరాయ్పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్, ఫాంటసీ టచ్ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్‌లో భారీగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తయి, బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే మేకర్స్ ఈ సినిమా నిడివిని రెండు గంటల 49 నిమిషాలుగా ఖరారు చేశారు. కంటెంట్ మీద తమకున్న నమ్మకంతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని టీమ్ చెబుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మనోజ్ మాంచు, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories