తమిళ స్టార్ హీరో ధనుష్ ఎలాంటి సినిమాలు ఎంచుకున్నా ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులు ఉంటారు. ఆయన నటించిన సినిమాలకు తమిళ్‌లోనే కాదు, తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆయన నేరుగా తెలుగు భాషలో చేసిన సినిమాలు ఇక్కడి ఆడియెన్స్‌కి బాగా నచ్చాయి.
ఇటీవల సార్, కుబేర వంటి సినిమాల ద్వారా తెలుగు అభిమానులను మరింత ఆకట్టుకున్న ధనుష్, ఇప్పుడు మూడోసారి నేరుగా తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని టాలీవుడ్ టాక్. వేణు ఉడుగుల చెప్పిన ఒక కథ ఆయనకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ వంటి చిత్రాలతో వేణు ఉడుగుల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.