పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి” గురించి సినీ అభిమానుల్లో ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాను దర్శకుడు సుజీత్ స్టైలిష్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, మొదటి సాంగ్ తోనే సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ మీద పడింది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం, ఈ మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ను సెప్టెంబర్ 19న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కానీ ఈ తేదీ ఫైనల్గా లాక్ అయ్యిందా లేక ఇంకాస్త ముందే వస్తుందా అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమాకి థమన్ మ్యూజిక్ అందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.