ఎత్తు పల్లాలను దాటుకుంటూ ప్రజాపథంలో 30 ఏళ్లు!

నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం.. భారత దేశంలోని రాజకీయ నాయకులలో విలక్షణమైనది. ఆయనను అత్యంత సీనియర్ గా కూడా నిలబెడుతుంది. అలాగే ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించి ముప్ఫయ్యేళ్లు పూర్తవుతున్నాయి. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో రాష్ట్రాధినేతగా, మాజీగా.. చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలని చవిచూశారు. ప్రజాప్రయోజనాల కోసం పని చేయడం ఒక్కటే తదేకదీక్షగా ఆయన తన ప్రస్తానం సాగిస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అనేది ప్రత్యేక పరిస్థితుల మధ్య చోటు చేసుకున్న సంఘటన! మిడిమిడిజ్ఞానంతో, చంద్రబాబు పట్ల ఉండే అసూయ, దుగ్ధతో ఎవ్వరు ఎలాంటి వ్యాఖ్యలైనా చేయవచ్చు గాక.. ఆనాటి రాజకీయ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అభాసుపాలవుతున్న సమయంలో పార్టీలో తిరుగుబాటులు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తుండగా అనివార్యమైన పరిస్థితులలో ఆయన పార్టీ పగ్గాలను తన చేతిలోకి తీసుకున్నారు. అప్పటి సీనియర్ నాయకులు వెల్లడించే ప్రకారం.. చంద్రబాబు నాయుడు ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు గనుక పార్టీ సమైక్యంగా ఉండగలిగింది. ఆయన ఊరుకుండిపోయినట్లయితే పార్టీలో ఇద్దరు ముగ్గురు నాయకులు అలాంటి తిరుగుబాటు చేసి ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ చీలికలు పేలికలుగా మారి ఉండేది. ఎప్పటికీ తిరిగి ఐక్యమై బలోపేతమై మన గలిగేది కాదు అని అప్పటి సీనియర్లు అంటూ ఉంటారు.

అది నిజం. ప్రత్యేక పరిస్థితులలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాయకత్వాన్ని కాదని ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు నాయుడు ఆ పని చేసినందుకు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఆ విమర్శల ప్రభావంలో పడి, తన కర్తవ్యాన్ని మాత్రం ఆయన మరవలేదు. వాటిపట్ల ఆయన నిస్సంగత్వాన్ని ప్రదర్శించారు. తాను పార్టీ కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఏ పనైనా చేశాడు తప్ప అందులో తన స్వార్థం ఏమీ లేదు అనే స్పృహతో ఆయన ముందుకు వెళ్లారు.

చంద్రబాబు వంటి దార్శనిక నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అనేక విధాలుగా రాష్ట్ర పురోభివృద్ధికి కలిసి వచ్చింది. ఈ క్రమంలో రాజకీయంగా ఆయనను ఓడించలేక కుటిల విమర్శలతో విరుచుకుపడిన ప్రత్యర్ధులను ఆయన ఏనాడూ ఖాతరు చేయలేదు.
నారా చంద్రబాబునాయుడు వంటి దార్శనిక నేత విశాల దృక్పథం కారణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇవాళ దేశంలోనే ఎన్నదగిన తొలి మూడు నాలుగు స్థానాలలో పదిలంగా ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన పరిస్థితులను వక్రంగా ప్రొజెక్టు చేస్తూ ఆయన్ని విమర్శించడానికి ప్రత్యర్థులు తమ కుటిలత్వం చూపిస్తూ ఉంటారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కేవలం కార్యదీక్షతోనే ముందుకు సాగుతుంటారు. అందుకే ఎత్తుపల్లాలు గెలుపోటములు ఎన్ని ఎదురైనప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అప్రతిహతంగా కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ ప్రజల సేవలో నిమగ్నం అయి ఉన్నారు. ఇప్పుడు 4.0 ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరిన్ని వినూత్నమైన ఆలోచనలను కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories