లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ ఇక లేరు. శనివారం అర్ధరాత్రి తరువాత సుమారు 1.45 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ ఇంటికి తీసుకురానున్నారు. మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే మెగా కుటుంబ సభ్యులు అరవింద్ నివాసానికి చేరుకుని నివాళులు ఆర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే చరణ్ మైసూర్ లో ఉండగా…ఆయన అక్కడి నుంచి హుటాహుటిన అరవింద్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి నాయనమ్మను చివరి చూపు చూసేందుకు ఇంటికి చేరుకున్నారు.