టాలీవుడ్లో పండుగ సీజన్‌కి సినిమాల మధ్య పోటీ తప్పనిసరి. అయితే 2004 సంక్రాంతి సమయంలో జరిగిన క్లాష్ ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఆ సమయంలో చిరంజీవి నటించిన అంజి, బాలకృష్ణ హీరోగా వచ్చిన లక్ష్మీ నరసింహా ఒకేసారి థియేటర్లలో విడుదలయ్యాయి. భారీ విజువల్స్‌తో అంజిపై అప్పుడు పెద్ద హంగామా నెలకొన్నా, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రభాస్ నటించిన వర్షం. ఆ సినిమా సూపర్ హిట్ అవుతూ, ప్రభాస్‌కి స్టార్ హీరోగా మారే దారిని వేసింది. అదే అతని మొదటి పెద్ద విజయంగా నిలిచింది.
ఇప్పుడు అదే తరహా పరిస్థితి 2026 సంక్రాంతి కోసం ఏర్పడేలా కనిపిస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు ఆ సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ప్రభాస్ రాజా సాబ్‌ను జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సెప్టెంబర్‌లో రావాల్సి ఉండగా వాయిదా పడటంతో, ఆ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే అవకాశం ఉందని టాక్ వినపడుతోంది.