ఎక్స్‌ట్రాలు చేసినందుకు ఇప్పుడు వైసీపీ మీదనే అనుమానాలు!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డిని చంపడానికి కుట్ర జరుగుతున్నదనే వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. నలుగురు రౌడీ షీటర్లు, నేరచరిత్ర ఉన్న వాళ్లు.. కలిసి లిక్కర్ తాగుతూ.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు’ అని మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. వారిలో ఒకరు గంజాయి కేసులో ప్రస్తుతం జైల్లోనే ఉండగా.. ఆ మిగిలిన నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే.. సాక్షి దళాలు, వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలంటూ మాట్లాడుకుంటున్న వాళ్లంతా తెలుగుదేశం కార్యకర్తలే అని ప్రచారం ప్రారంభించింది. అక్కడితో ఆగినా కూడా ఒక రకంగా ఉండేది. శ్రీధర్ రెడ్డిని ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఈ హత్యకు కుట్ర రచన చేసినట్టుగా కూడా వైసీపీ ఆరోపణలు చేసింది. ఒక వీడియో బయటకు రాగానే.. దానికి రకరకాల రంగులు పులమడంలో ఈ అత్యుత్సాహమే ఇప్పుడు ప్రజలందరి అనుమానాలు వారి వైపు మళ్లేలా చేస్తున్నది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార సరళి.. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉన్నదని.. ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి అంటున్నారు. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లనే హతమార్చిన డీఎన్ఏ మీది.. ఈ వీడియో విడుదల కాగానే వైసీపీ ఎందుకు స్పందిస్తోంది? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

సొంత కుటుంబసభ్యులను చంపించే సంప్రదాయం తమది కాదని, ఆస్తులు- అంతస్తుల కోసం తోడబుట్టిన వారిని వేధించే సంప్రదాయం మాది కాదని కోటంరెడ్డి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కౌంటర్లు ఇస్తున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రోజులనుంచి కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొరుకుడుపడని నేతగానే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ పనికోసం జగన్ వద్దకు వెళ్లినా సరే.. ధనంజయ అన్నను కలవండి అంటూ ఓఎస్డీ దగ్గరకు పంపే వైనం గురించి కూడా.. పార్టీలో ఉండగానే విమర్శలు చేసినవ్యక్తి కోటంరెడ్డి. జగన్ హామీ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు పనులు చేయడం గురించి పట్టించుకోవడం లేదని, ఇలాగైతే ప్రజల ఎదుట తలెత్తుకుని ఎలా తిరగగలం అని.. అనేకమార్లు ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి. గత ప్రభుత్వపు చివరి రోజుల్లో ఆ్న తెలుగుదేశంలో చేరిపోయారు. ఆ పార్టీ తరఫున మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన ఖచ్చితంగా వైసీపీ వారి హిట్ లిస్టులో ఉండే అవకాశం ఉంది. కొంందరు రౌడీషీటర్లు ఆయన హత్య గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. వీడియో బయటకు వచ్చింది. దీని వెనుక ఎవరున్నారో.. వాళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పింది ఎవరో, హత్య ప్రణాళిక ఎంతవరకు వచ్చిందో.. మొత్తం పోలీసులు నిగ్గు తేల్చాలి. కానీ.. సాక్షి, జగన్ దళాలు అత్యుత్సాహం ప్రదర్శించి, ఇదంతా తెలుగుదేశం వాళ్లే చేస్తున్నట్టుగా.. సొంత తమ్ముడే శ్రీధర్ రెడ్డిని చంపించాలని చూస్తున్నట్టుగా ప్రచారం మొదలుపెట్టి.. ఇరుకున పడ్డారు. భుజాలు తడుముకున్న దొంగలాగా.. ఆ మాటలన్నీ మాట్లాడేసరికి ప్రజల అనుమానాలు వారిమీదకే మళ్లుతున్నాయి. తమ్ముడు చంపించాలని అనుకున్నట్టుగా.. ప్రచారం చేసిన వారికి ఆ వివరం ఎలా తెలిసిందో చెప్పాలని పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories