పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న ప్రాజెక్ట్ “ఓజి” మీద అభిమానుల్లో అసాధారణమైన ఆసక్తి నెలకొంది. దర్శకుడు సుజీత్ తో కలిసి చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మీద మొదటి నుంచే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ కారణంగా టికెట్ బుకింగ్స్ దగ్గర నుంచే పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకంగా అమెరికా మార్కెట్ లో ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించబోతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న హైప్ కి తోడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన గత సినిమా హరిహర వీరమల్లు కి చివరి దశలో ప్రమోషన్స్ చేయడంతో అప్పుడు సినిమాకి ఊహించని స్థాయిలో బజ్ పెరిగింది. అలానే ఇప్పుడు ఓజి కోసం కూడా పవన్ ముందుకు వస్తే, ఈ సినిమాకి మరింత విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.