టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కలెక్షన్ కింగ్ డాక్టర్ ఎం.మోహన్ బాబు. ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించి, ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఆయన ఏ సినిమాలో నటించినా, ఆ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారడం ఖాయం అని అభిమానులు నమ్ముతారు. కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ఓ సినిమాలో ఆయన తెరపై కనిపించబోతున్నారని సమాచారం వస్తోంది.
ఘట్టమనేని కుటుంబానికి చెందిన రమేష్ బాబు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ కొత్త చిత్రాన్ని “ఆర్ఎక్స్ 100” వంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్ట్‌లో విలన్‌గా మోహన్ బాబు నటించే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని టాక్.