పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి నుంచి తాజాగా మరో మెలోడియస్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, అభిమానుల్లో ఈ మూవీపై ఎప్పటినుంచో భారీ ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ పవర్‌ఫుల్ బీట్‌లతో అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు వచ్చిన రెండో సాంగ్ సువ్వి సువ్వి పూర్తిగా వేరే మూడ్‌లో అందరినీ కట్టిపడేస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్‌లో పాత జ్ఞాపకాలు గుర్తు చేసే టచ్ ఉండగా, గాయని శృతి రంజని స్వరంతో ఈ పాట మరింత ఆకర్షణీయంగా మారింది.
ముఖ్యంగా ఈ సాంగ్ లిరిక్స్, మెలోడి లేడీస్ ఆడియన్స్‌కి బాగా నచ్చేలా ఉన్నాయి. అలాగే స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య కనిపించిన కెమిస్ట్రీ కూడా ఈ పాటకు హైలైట్‌గా నిలిచింది.