ఓటీటీలో పుష్పని మించిపోయిన దేవర

ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర థియేటర్లలోనే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండుగలా మారింది. థియేటర్ల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ ట్రెండ్స్‌లో నిలుస్తోంది.

ఇప్పటికే పుష్ప 2 నెట్‌ఫ్లిక్స్‌లో 10 వారాల పాటు వరుసగా టాప్ 10 లిస్ట్‌లో కొనసాగింది. అయితే దేవర ఆ రికార్డును దాటి 11 వారాలపాటు టాప్ ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. దీంతో ఓటీటీ రేసులో దేవర సక్సెస్ పుష్ప 2 కంటే ఎక్కువగా నిలిచిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ప్రేక్షకుల నుంచి ఇంత పెద్ద రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు దేవర పార్ట్ 2 కోసం ప్లానింగ్‌ మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories