పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా వస్తున్న తాజా చిత్రం “ఓజి” చుట్టూ అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ కొత్త అప్‌డేట్ తో ఆసక్తి మరింత పెంచారు. రేపటినుంచే ఈ సినిమాకు సంబంధించిన రెండో పాటను విడుదల చేయబోతున్నారు.
ఈ సాంగ్ రిలీజ్ తర్వాత సినిమా ప్రమోషన్లను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని టీమ్ భావిస్తోంది. దీంతో రేపటి నుంచే ఓజి ప్రమోషన్ హంగామా మొదలవుతుందని చెప్పొచ్చు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.