అవన్నీ జరిగితే రాష్ట్ర ముఖచిత్రం మారిపోదా?

నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని బహుముఖంగా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మార్చడానికి ఇతోధికంగా కృషి జరుగుతోంది. రాష్ట్రంతో కనెక్టివిటీని పెంచడం అనేది.. ఎప్పుడూ కూడా పారిశ్రామిక పురోగతికి బీజం వేస్తుంది. అలాంటి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రంతో కనెక్టివిటీ పెంచే ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి. ఇవన్నీ సాకారం అయితే.. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే కొత్తగా రెండు ఎయిర్ పోర్టులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. కుప్పంలో ఒక కార్గో విమానాశ్రంయతో పాటు, దగదర్తిలో కూడా విమానాశ్రయం రానుంది. ఇదొక కీలక ముందడుగు అయితే.. దేశంలోనే అతి పొడవైన సముద్ర తీరం కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ అనుకూలతను వాడుకోవడానికి ఇంకా పెద్ద కృషి జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చేయాలని ఎన్డీయే ప్రభుత్వం సంకల్పిస్తోంది. ప్రస్తుతం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ పనులను సత్వరం పూర్తిచేసి 2026 నాటికి అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. అవి కార్యకలాపాలు ప్రారంభించేలోగా.. వాటిని అనుసంధానిస్తూ రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ పెంచాలని పలు ప్రాజెక్టులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా పోర్టు సేవలు విస్తరించేలా చూస్తున్నారు. తెలంగాణ, ఒదిశాలలో డ్రైపోర్టులు ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు ఉండేలా చూడాలనుకుంటున్నారు.

ఇదే జరిగితే.. విదేశాలతో ఎగుమతుల పరంగా కనెక్టివిటీ బీభత్సంగా పెరుగుతుంది. దాని పర్యవసానంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్పాదక రంగంలోని పరిశ్రమలకు స్వర్గధామం అవుతుంది. సేవారంగాలలో రాష్ట్రాన్ని అనేక అంతర్జాతీయ కంపెనీలకు డెస్టినేషన్ గా మార్చడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో.. 20 పోర్టులు రావడం కూడా జరిగితే.. పరిశ్రమల పరంగా కూడా ప్రతి పెద్ద కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లో తమ ఉత్పాదక యూనిట్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. తద్వారా.. ఈ అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగా కల్పన చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు సర్కారు మాట నిలబెట్టుకవోడమూ అవుతుంది. పారిశ్రామిక పురోగతి వలన.. అన్ని రకాలుగానూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ఆశిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories