ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇప్పటికే భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అందులోని యాక్షన్ సీన్స్ బన్నీ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ యాక్షన్ పర్ఫార్మెన్స్తో పాటు బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వార్తలు నిజమైతే బన్నీ అభిమానులకు ఈ సినిమా ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడని సమాచారం. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో అల్లు అర్జున్ పాత్రకు విభిన్న కోణాలు ఉంటాయని చెబుతున్నారు. మరికొందరు అయితే బన్నీ నెగటివ్ షేడ్స్‌లో కూడా కనిపిస్తాడని అంటున్నారు. అంతేకాకుండా గెస్ట్ అప్పియరెన్సుల కోసం కూడా అట్లీ ప్రత్యేకమైన రోల్స్ డిజైన్ చేస్తున్నాడట. ఆ రోల్స్‌లో ఎవరు కనిపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.