అఖిల్‌ కోసం స్టార్‌ బ్యూటీ!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లెనిన్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ గురించి తరచూ కొత్త కొత్త గాసిప్స్ బయటకు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. ఈ పాట కోసం మేకర్స్ ఒక టాప్ హీరోయిన్‌ని తీసుకురావాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఐటమ్ సాంగ్‌ను మాస్ బీట్‌లో రూపొందించి, ఫేమస్ సింగర్ మంగ్లీతో పాడించేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్ నిజం అయితే ప్రేక్షకుల దృష్టి ఈ పాటపైనే ఎక్కువగా నిలిచే అవకాశం ఉంది.

సినిమా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది. ముఖ్యంగా చిత్తూరు యాసలో అఖిల్ పాత్ర కనిపించబోతుందని సమాచారం. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కూడా అక్కడి భాషా స్టైల్‌లోనే ఉండబోతోందని తెలిసింది. హీరోయిన్‌గా శ్రీలీల స్క్రీన్‌పై అఖిల్‌తో జోడీ కట్టబోతుంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఆకర్షణీయంగా చూపించబోతున్నారని యూనిట్‌లో టాక్ ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories