పచ్చిబూతుల ఆదిశేషును నెత్తిన మోస్తున్న జగన్!

జగన్మోహన్ రెడ్డికి కనీస విచక్షణ అక్కర్లేదు. చంద్రబాబునాయుడు ను ఎవరు బాగా తిడితే వారే తనకు అత్యంత ప్రీతిపాత్రుడు! పవన్ కల్యాణ్ మీద ఎవరు దుమ్మెత్తి పోస్తే వాడే జగన్ కు అత్యంత ఆరాధ్యుడు! అంతకు మించి జగన్ కు వేరే కొలబద్ధ ఏదీ ఉండదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం.. జగన్ మనసెరిగి నడుచుకుంటూ ఉంటుందనేది తెలిసిన సంగతే. ఇలాంటి నేపథ్యంలో.. పులివెందుల నియోజకవర్గంలో.. పచ్చిబూతులతో కూడిన, అత్యంత నీచమైన వీడియోలు పోస్టు చేస్తూ పాపులర్ అయిన యూట్యబూర్ ఆదిశేషు సుంకేశులను నెత్తిన మోస్తూ, జగన్ మరియు ఆయన దళాలు తప్పు చేస్తున్నాయనే అభిప్రాయం స్థానికంగానే వ్యక్తం అవుతోంది.
వివరాల్లోకి వెళితే… పులివెందులలో ఆదిశేషు సుంకేశుల  అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు.

జగన్ కు వీరాభిమాని. జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తా.. అని చెప్పుకుంటూ వీడియోలు పోస్టు చేసి.. తద్వారా కాస్త వ్యూస్ సంపాదించుకునే వ్యక్తి. పనిలో పనిగా చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పెద్దపెద్ద సవాళ్లు విసరడం ద్వారా జగనన్న కళ్లలో ఆనందం చూడాలనుకునే వ్యక్తి. తన యూట్యూబ్ చానెల్లో పచ్చిబూతులతో కూడిన వీడియోలు పెట్టి.. వాటికి కామెడీ అనే రంగు పులిమి వెకిలివేషాలు వేస్తూ దానినే జనాదరణ అనుకునే వ్యక్తి. అలాంటి ఆదిశేషు సుంకేశుల చేతిలో జగన్ పులివెందుల జడ్పీటీసీ స్థానం పార్టీ ప్రచార బాధ్యతలను పెట్టారు.

ఇలా చేసినప్పుడే.. మండలంలోని పార్టీ నాయకులు చాలా అవమానం ఫీలయ్యారు. ఇలాంటి నీచమైన వీడియోలు చేసుకునే వాడిని ప్రచారసారథిలాగా చేయడం తమకు అవమానంగా పార్టీలోని సీనియర్లు భావించారు. అయితే సదరు ఆదిశేషు సుంకేశుల మాత్రం ఎడాపెడా రెచ్చిపోతూ.. చంద్రబాబు దగ్గరినుంచి కూటమి పార్టీల ప్రముఖ నాయకులందరినీ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ.. తమ పార్టీ వారికి గొప్ప వినోదాన్నే అందించాడు. అలాంటి అతి వేషాలను ప్రజలు అసహ్యించుకున్నారే తప్ప.. ఎన్నికల్లో ఫలితం లభించలేదు. కానీ.. ఆదిశేషు.. తమ రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా నియోజకవర్గంలోని ఇతర నాయకుల్ని కూడా ఎడాపెడా తిట్టిపోసిన వ్యవహారాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.

తాజాగా ఆదిశేషు ప్రయాణిస్తున్న కారు మీద దాడి జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. గాయపడ్డానని ఆస్పత్రిల్లో కట్టు కట్టించుకున్న ఆదిశేషు పోలీసులకు తెలుగుదేశం నాయకుడే దాడి చేసినట్టు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వెకిలి వేషాల యూట్యూబర్ మీద దాడిని జాతికి జరిగిన మహోపకారం లాగా చిత్రీకరించడానికి సాక్షి మీడియా ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పచ్చిబూతుల వీడియోలు పెట్టే వ్యక్తిని జగన్ నెత్తిన పార్టీకి పరువునష్టమే తప్ప ప్రయోజనం లేదని సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories