లోకల్ బ్రాండ్ హనీ ట్రాప్ లో టాప్ అరుణ !

‘హనీ ట్రాప్’ అనే పదాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం. దేశంలో అత్యున్నత స్థాయి అధికారులను, నాయకులను శృంగారం ముగ్గులోకి దించేలా అమ్మాయిలను ప్రయోగించి, ఆ అమ్మాయిల ద్వారా దేశ రహస్యాలను, సైనిక రహస్యాలను, ఇంకా అనేక కీలక సంగతులను రాబట్టి తమ పబ్బం గడుపుకునే వారి గురించి వాడే పదం ఇది. ఈ స్థాయి హనీ ట్రాప్ లను చాలా పెద్ద పెద్ద వ్యవహారాల్లోనే మనం ఇన్నాళ్లుగా వార్తల్లో గమనించాం. స్థానికంగా రౌడీయిజం, గూండా గిరి చేయించే ఒక లేడీ డాన్ అనేక మంది అధికారులను నాయకులను ఇలాంటి హనీ ట్రాప్ ద్వారా తన గుప్పిట పెట్టుకోవడం మనకు అరుదుగా కనిపించే సంగతి. లోకల్ హనీ ట్రాప్ వ్యవహారాలలో పరాకాష్ట అన్నదగినట్లుగా ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణ వ్యవహారం వెలుగులోకి వస్తోంది.

కిలేడీగా పత్రికలు వ్యవహరిస్తున్న అరుణను అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద స్వాధీనం చేసుకున్న రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లోని డేటాను కోర్టు అనుమతితో రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన అనేకమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒక ఐపీఎస్ అధికారితో అరుణ అత్యంత సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలు కూడా ఆ ఫోన్లో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పైగా అరుణకు- ఎవరితో మాట్లాడినా సరే ఆ ఫోన్ కాల్ ఆడియో రికార్డు చేసుకునే అలవాటు ఉందని కూడా అంటున్నారు. అలాగే ఎవరినైనా కలిసినప్పుడు వారితో సన్నిహితంగా రొమాన్స్ లో మునిగి ఉన్నపుడు కూడా వీడియోలు తీసుకునే, ఫోటోలు తీసుకునే అలవాటు ఆమెకు ఉందని అంటున్నారు. ఇవన్నీ బయటకు వస్తే నెల్లూరు జిల్లా రాజకీయ అధికార వ్యవస్థలలో భూకంపం పుడుతుందని అంచనా వేస్తున్నారు. అనేకమంది నాయకులు ఇప్పటికే కంగారుపడుతున్నట్లుగా సమాచారం.
ఒక మహిళ కేవలం శృంగారాన్ని ఎరగా వేసి.. వివిధ వర్గాలకు చెందిన అనేక మందిని లొంగదీసుకుని, దాసోహం చేసుకొని వారిని పావులుగా వాడుకుంటూ తన నేర సామ్రాజ్యాన్ని విచ్చలవిడిగా చెలాయించడం అనేది ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి, కేవలం అమ్మాయిలను ఎరగా వేయడం ద్వారా లొంగదీసుకున్న వారితోనే.. తాను తన ప్రియుడు శ్రీకాంత్ కలిసి చలాయించిన రౌడీయిజం సామ్రాజ్యాన్ని ఆమె పటిష్టం చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు. మరి ఆమె ఫోన్ ద్వారా డేటా సేకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎంత మేరకు కొలిక్కి వస్తాయో.. ఎందరి జీవితాలలో గుట్టుమట్టు రహస్యాలు బయల్పడతాయో వేచి చూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories