ఆ డైరెక్టర్‌ తో కార్తీ సినిమా!

కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమాకి పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత, ఆ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని తెలుగు, తమిళ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ మొదలవ్వాల్సిన టైమ్‌లో మొదలుకాక, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కోలీవుడ్ లోనుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఖైదీ 2 త్వరలో మొదలయ్యేలా పరిస్థితులు కనబడట్లేదని టాక్ వినిపిస్తోంది.

ఇక మరోవైపు, కార్తీ తన ఖైదీ 2 కోసం కేటాయించిన డేట్స్ ని మరో దర్శకునికి ఇవ్వడం జరిగిందన్న వార్త బయటకి వచ్చింది. ఆ దర్శకుడు తమిళంలో హారర్ కామెడీ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సుందర్ సి. అరణ్మనై సిరీస్ తో మంచి హిట్స్ అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు కార్తీతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories