మన శంకరవరప్రసాద్‌ గారు పండక్కి వస్తున్నారు!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని వరుసగా సినిమా అప్డేట్లు వస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన కొత్త సినిమా టైటిల్ “మన వరప్రసాద్ గారు” అధికారికంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనీల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సినిమా కథను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నేపథ్యంలో రూపుదిద్దుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో 90 శాతం వరకు ఎంటర్టైన్మెంట్, కామెడీ కలిపి మెగాస్టార్ అభిమానులు కోరుకునే అన్ని మాస్స్ ఎలిమెంట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో చిరంజీవి చేతిలో మెషిన్ గన్స్ కనిపించడంతో సినిమాకి యాక్షన్ ఫ్లేవర్ కూడా బాగా ఉంటుందని అర్థమవుతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ భారీ ప్రాజెక్ట్ విడుదల కాబోతోందని టాక్ వినిపిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరో అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను షైన్ స్క్రీన్స్ బ్యానర్ తీసుకుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories