తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి “విశ్వంభర”. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ నుంచి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
గత ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత సినిమా ముందుకు సాగకపోవడంతో కొంత నిరాశ, టెన్షన్ కూడా అభిమానుల్లో కనబడ్డాయి. అయితే ఇప్పుడు వచ్చిన టీజర్ ఆ తగ్గిన హైప్‌ని మళ్లీ రెట్టింపు చేసింది.
టీజర్లో చూపించిన విజువల్స్ ఈ సారి మాత్రం ఎవరినీ నిరాశపరచలేదు. బిగ్ స్క్రీన్ అనుభూతి ఇచ్చేలా ఉన్న గ్రాఫిక్స్, ప్రెజెంటేషన్ చూసి ప్రేక్షకులలో మంచి పాజిటివ్ బజ్ మొదలైంది. మేకర్స్ కూడా ఈ సినిమా కోసం భారీ స్కేల్లో క్వాలిటీ వర్క్ చేసి, వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.