కిష్కింద పురి కోసం బిజీ అయిన బెల్లంకొండ!

టాలీవుడ్‌లో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజా సినిమా కిష్కంధపురితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటి నుంచే సినిమా ప్రేమికుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ఈ సినిమాపై పాజిటివ్ టాక్‌ను తెచ్చాయి.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతకు ముందు వీరి జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అందుకే మళ్లీ వీరి కాంబినేషన్ తెరపై మరోసారి మ్యాజిక్ చూపిస్తుందనే అంచనాలు అభిమానుల్లో పెరిగాయి.

షూటింగ్ పనులు పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హీరో శ్రీనివాస్ డబ్బింగ్‌లో పాల్గొంటూ చివరి పనులు పూర్తి చేస్తున్నారు. డబ్బింగ్ పూర్తయిన వెంటనే రిలీజ్ ప్లానింగ్‌ను ఫైనల్ చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 12న భారీగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories