ఆ ఓటీటీలో జాన్వీ, రష్మిక సినిమాలు!

పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్‌లలో రష్మిక మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఈ ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సహా అనేక భాషల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ చేతికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

జాన్వీ కపూర్ నటించిన పరం సుందరి సినిమా, రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన థామా హారర్ థ్రిల్లర్ సినిమాల హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. వీటితో పాటు మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న సిద్ధత్, బద్లాపూర్ 2 వంటి మరికొన్ని ప్రాజెక్టులు కూడా ప్రైమ్ లిస్టులో చేరాయి.

రష్మిక ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఈ దీపావళి సందర్భంగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జాన్వీ కపూర్ సినిమా ఆగస్టు 29న ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories