టాలీవుడ్ నుంచి తాజాగా విడుదలైన సినిమాల్లో “కొత్తపల్లిలో ఒకప్పుడు” కూడా ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడిగా ‘కేరాఫ్ కంచరపాలెం’లో నటించిన ప్రవీణ పరుచూరి పనిచేశారు. గ్రామీణ నేపథ్యంలో హారర్ తో పాటు కామెడీని కలిపిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి సరైన స్పందనను అందుకుంది. కొత్త ముఖాలైన మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన జంటగా నటించారు.
ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రన్ ముగిసిన వెంటనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఆహా ప్లాట్‌ఫామ్ ఈ చిత్రానికి హక్కులు తీసుకుంది. ఆహా గోల్డ్ సభ్యులకు సినిమా ఒక రోజు ముందే అందుబాటులోకి వచ్చి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇక సాధారణ యూజర్లకు మాత్రం రేపటి నుండి అందుబాటులో ఉంటుంది.