నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం “అఖండ 2 తాండవం”పై అభిమానుల్లో ఊహించలేని హంగామా కొనసాగుతోంది. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ ఇప్పటివరకు ఇచ్చిన హిట్స్ తో ఈ కొత్త సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వరుసగా మూడు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌కి క్రేజ్ మరింత పెరిగింది.
అయితే అభిమానులు ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది రిలీజ్ డేట్ గురించే. తొలుత సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఒక్క పాట గానీ, పెద్ద ప్రమోషనల్ కంటెంట్ గానీ బయటకు రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. నిజంగా సినిమా ఆ డేట్‌కే వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అన్న సందేహం ఫ్యాన్స్‌లో పెరుగుతోంది.