సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం కూలీపై అంచనాలు రిలీజ్‌కి ముందే పీక్స్‌కి చేరుకున్నాయి. ప్రేక్షకులు కూడా అదే ఉత్సాహంతో థియేటర్లకు వచ్చి హౌస్‌ఫుల్ షోలు ఇచ్చారు. ఫలితంగా సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది.
రిలీజ్ తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం, కూలీ మొదటి రోజు మాత్రమే కాదు రెండో రోజు కూడా బలమైన హోల్డ్ చూపింది. రెండో రోజు వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం సుమారు 86 కోట్ల గ్రాస్ సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. ఇందులో భారతదేశం నుంచే 55 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.
కేవలం రెండు రోజుల్లోనే కూలీ మొత్తం 200 కోట్ల మార్క్‌ని అందుకోవడం ఈ చిత్రానికి మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. అనిరుద్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. ఇక రజినీకాంత్‌తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టిన సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.