ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రిలీజ్ అయిన సినిమాలు “వార్ 2” మరియు “కూలీ”. రజినీకాంత్, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే పెద్ద హైప్ తెచ్చుకున్నాయి. టాక్ పరంగా పెద్ద స్థాయిలో బ్లాక్బస్టర్ అనిపించుకోకపోయినా, బుకింగ్స్ మాత్రం ఊహించని స్థాయిలో జరిగాయి.
రిలీజ్కు ముందు వరకు కూలీ ఎక్కువ దృష్టిని ఆకర్షించగా, రిలీజ్ అయిన తరువాత మాత్రం వార్ 2 బలంగా దూసుకెళ్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షో ద్వారా కూలీకి దాదాపు 6 లక్షల 89 వేల టికెట్లు అమ్ముడవ్వగా, వార్ 2 మాత్రం 7 లక్షల 45 వేల టికెట్లు దాటేసింది. దీంతో రెండో రోజు కేవలం వార్ 2నే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఇక మూడో రోజు ఈ పోటీ ఎలా కొనసాగుతుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.