చిన్న తారక్‌ ఎవరో తెలుసా!

బాలీవుడ్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన వార్ 2 సినిమా టాలీవుడ్ సహా అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ అందుకుంటోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో ఇద్దరు హీరోలకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించారు.

ఆ సీన్స్ లో చిన్ననాటి పాత్రల్లో ఇద్దరు బాల నటులు కనిపించారు. కానీ తారక్ చిన్నప్పటి క్యారెక్టర్ పోషించిన పిల్లాడు మాత్రం తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. చాలా మంది ప్రేక్షకులు ఈ చిన్నారిని చూసి, ఇంతకు ముందు ఎక్కడో చూశామనిపించిందని అనిపించుకుంది.

అదే నిజం. సుమారు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఒక కమర్షియల్ యాడ్ లో ఈ పిల్లాడు కనిపించాడు. “పోరా పో.. పోర్ రబ్ పోర్” అంటూ వైరల్ అయిన ఆ సర్ఫ్ యాడ్ గుర్తుండే ఉంటుంది. అదే యాడ్ లో నటించిన చిన్నవాడే ఇప్పుడు వార్ 2 లో యంగ్ టైగర్ చిన్ననాటి పాత్రలో అదరగొట్టాడు.

ఈ కిడ్స్ యాక్టర్ పేరు హార్టీ సింగ్. స్క్రీన్ మీద తన ఎనర్జీ, అగ్రెసివ్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బాల నటుడు, సినిమాలో తన నటనకి మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories