కూలీని దాటిపోతున్న తారక్‌ మూవీ!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ – దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన కూలీ, ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రిలీజ్‌కి ముందు వరకు రెండు సినిమాలు కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే, థియేటర్లలో మొదటి రోజు పూర్తయ్యాక పరిస్థితులు కొంత మారినట్టు కనిపిస్తోంది.

బుక్మైషో హవర్స్ ట్రెండ్స్‌లో రిలీజ్‌కు ముందు కూలీ టికెట్ల అమ్మకాల్లో ముందంజలో ఉండగా, ఇప్పుడు మాత్రం వార్ 2 దానిని అధిగమించింది. మొదట కూలీకి 13 వేల టికెట్లు అమ్ముడవ్వగా, తాజా లెక్కల్లో వార్ 2 14 వేల టికెట్లు సొంతం చేసుకుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రెండో రోజు నుంచి వార్ 2 పట్టు బిగిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇక ఈ వేగం వసూళ్లలో కూడా కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories