ప్రత్యర్థిని ఎదుర్కొనే దమ్ము లేకపోతే, ఏకంగా ప్రత్యర్థిని అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు పన్నడం అనేది ఫ్యాక్షనిస్టుల సంస్కృతి. చాటుమాటు దాడులతో ప్రత్యర్థిని అంతమొందించాలని వారు కోరుకుంటూ బతుకుతుంటారు. తన నరనరానా ఫ్యాక్షనిస్టు ధోరణి నిండి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన ప్రెస్ మీట్ సాక్షిగా చంద్రబాబునాయుడు విషయంలో అదే ధోరణిని కనబరుస్తున్నారు. తన ఫ్యాక్షన్ పోకడలను అనుసరించి.. అంతమొందించడం కూడా అంత సులభం కాదని అందుకు భయపడుతున్నట్టుగా ఉంది. బహుశా అలాంటి పరిణామం దానంతట అది జరగాలని.. పాపం ఆయన వారానికి నాలుగురోజులు బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోని చర్చిలో ప్రభువుకు ప్రార్థనలు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదం అవుతున్నాయి. చంద్రబాబుకు బహుశా జీవితంలో ఇవి చివరి ఎన్నికలు కావొచ్చు అని శాపనార్థాలు పెడుతున్నారు. రామా కృష్ణా అనుకునే వయసులో, కనీసం ఆ మాదిరిగా అన్నా జేస్తే పుణ్యమన్నా వస్తాది.. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావ్.. అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. బహుశా ‘రామా కృష్ణా’ అని కూడా అనుకోకుండా.. ఏపీ ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ పనిచేస్తున్న చంద్రబాబునాయుడు.. తొందరగా నరకానికి వెళ్లాలని.. జగన్మోహన్ రెడ్డి… ‘యెహోవా.. అలలూయా..’ భజన చేస్తూ యలహంకలో ప్యాలెస్ లో కాలం గడుపుతున్నట్టుగా ఉంది.
జగన్ మనసులో ఎంత కుళ్లు దాచుకుని రాజకీయం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ అని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు జీవించి ఉండగా.. తాను నెగ్గి మళ్లీ అధికారంలోకి రాగలను అనిగానీ, అసలు రాజకీయం చేయగలను అని గానీ.. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం సడలిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన చావును కోరుకుంటున్నారు.
అయినా జగన్మోహన్ రెడ్డి కాస్త అతిగా.. కృష్ణా రామా అనుకునే వయసువచ్చింది గనుక.. చంద్రబాబు జీవితానికి ఇది చివరి ఎన్నిక కావాలని ఆశ పడుతున్నాడు. అయితే ఆయన గుర్తుంచుకోవాల్సిన సంగతి ఒకటుంది. ఏం వయసు అయిపోయిందని ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లోనే అర్జంటుగా వెళ్లిపోయాడు. పాతిపెట్టిన దేహభాగాలు ఎవరివో కూడా తెలియనంత ఘోరంగా చచ్చిపోయారు.. ఏం వయసైందని? అలాంటి చావు ఏ వయసు వారికైనా ఉన్నపళంగా వచ్చేస్తుంది.. అనే సంగతి కూడా జగన్ తన తండ్రి అనుభవం నుంచి కూడా నేర్చుకోకపోతే ఎలాగ అని ప్రజలు అనుకుంటున్నారు.