మాస్ ఫాన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమల్లో “వార్ 2” ఒకటి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు. హృతిక్‌తో జతకట్టడం ద్వారా ఎన్టీఆర్ హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు ముందే మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంది.
ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఇప్పటివరకు చాలానే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఆయన ఎంట్రీ ఎప్పుడు వస్తుందనే విషయంపై అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్‌లోనే కనిపిస్తారనే టాక్ గతంలో వచ్చినా, తాజాగా వినిపిస్తున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. కథ మొదలైన 20 నిమిషాలకే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, ఆ తర్వాత నుంచి హృతిక్‌తో ఆయన సీన్లు సమానంగా కొనసాగుతాయని తెలుస్తోంది.
దీంతో, “వార్ 2”లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై అభిమానులు ఎలాంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. శక్తివంతమైన పాత్రలో ఆయన హృతిక్‌తో సమానంగా మెరవడం ఖాయం అనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.