ఉచితం’పై ఇంత నీచంగా విషం చిమ్ముతున్నారా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలకు కనీస విచక్షణ కొరవడుతోంది. ప్రభుత్వాన్ని నిందించడానికి, బురద చల్లడానికి తాము రకరకాల ఆరోపణలు సిద్ధం చేసి పెట్టుకుంటే.. వాటికి అసలు అవకాశమే లేకుండా కూటమి ప్రభుత్వం సవ్యమైన, నిజాయితీగల పరిపాలన అందిస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు రావడం చూసి వారు ఓర్చుకోలేకపోతున్నారు. తమ విమర్శలకు బలం సన్నగిల్లడం అంటే తమ పార్టీకి పాడె కట్టినట్టే అనే భయం వారిలో వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి సర్కారు ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తున్న స్త్రీ శక్తి పథకం గురించి జగన్మోహన్ రెడ్డి దళాలు విషం చిమ్ముతున్నాయి. తమ అల్పత్వాన్ని ఆరకంగా వారు బయట పెట్టుకుంటున్నారు.

స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని సర్కారు కల్పిస్తోంది. కేవలం మహిళల సొంత జిల్లాకు మాత్రమే ఉచితం ఎన్నికల హామీ ఇచ్చిన సర్కారు.. ఇప్పుడు  రాష్ట్రవ్యాప్తంగా కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునంటూ.. ఘనంగా ఆ హామీని అప్ గ్రేడ్ చేసింది. కేవలం ఉచితం మాత్రమే కాకుండా.. రద్దీ పెరగనున్న దృష్ట్యా మహిళలకు ఆర్టీసీ బస్సులో అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా.. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలనుకూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్ని జరుగుతోంటే జగన్ దళాలు మాత్రం స్త్రీశక్తి పథకం మీద విషం కక్కుతున్నాయి.

‘మహిళలకు చంద్రబాబునాయుడు అతిపెద్దమోసం’ అంటూ తాటికాయంత అక్షరాలతో పతాక శీర్షికలు పెట్టి.. తమ పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో, తమ మోచేతి నీళ్లుతాగి బతికే ఇతర మీడియా సంస్థల ద్వారా విషం కక్కడానికి వైసీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంతకు వారు చెబుతున్నది ఏంటో తెలుసా.. సూపర్ లగ్జరీ, లగ్జరీ, నాన్ స్టాప్, డీలక్స్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించాలట. దేశంలో ఎక్కడా ఇలాంటి విధానం లేనేలేదు. కేవలం ఒక జిల్లాకు మాత్రమే ఉచితం అని ప్రకటించిన చంద్రబాబు, మహిళల విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని, వారి వికాసం కోసం.. రాష్ట్రమంతా ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు పట్ల అపరిమితమైన కృతజ్ఞతా భావం ఏర్పడుతుందనే భయం వైఎస్సార్ కాంగ్రెస్ను వెన్నాడుతోంది. చంద్రబాబు ముందే చెప్పినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతోంటే..  వైసీపీ దళాలు.. ప్రజల్లో అపోహలు కలిగించడానికి, విషప్రచారానికి తెగబడుతున్నాయి. ప్రభుత్వం ఏకంగా అయిదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణావకాశం కల్పిస్తోంది. ఈ ప్రకారం దాదాపు 9వేల బస్సుల్లో ఉచిత ప్రయాణం వారికి లభిస్తుంది. వైసీపీ మాత్రం కుటిల నీతిని ప్రదర్శించడం జరుగుతోంది. జగన్ హయాంలో కూడా ఏవైనా పథకాలు ఇచ్చినా.. వాటికి కూడా ఏదో ఒక నియంత్రణ, విధివిధానాలు ఉన్నాయి కదా.. వీటిని మాత్రం ఇలా తప్పుపడుతున్న జగన్.. తాను అధికారంలోకి వస్తే.. లగ్జరీ, సూపర్ లగ్జరీ తదితర వందశాతం బస్సల్లో ఉచితప్రయాణం కల్పిస్తానని చెప్పగలరా? అంటూ పలువురు ఈసడించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories