ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2పై మంచి హైప్ నెలకొంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాల్గొన్నందుకే సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. రిలీజ్కు ముందు చిత్రబృందం నేడు భవ్యమైన ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి.
తాను ఎప్పుడూ తన సినిమాలపై నమ్మకంగా మాట్లాడే నాగవంశీ, వార్ 2 విషయంలో కూడా అదే ధైర్యం చూపించారు. ఈ సినిమా నచ్చకపోతే ఇప్పటివరకు ఎన్ని విమర్శలు చేసినా వాటికన్నా పదింతలు చేయొచ్చని సూటిగా చెప్పేశారు. ఆయన మాటల ద్వారా ఈ సినిమాపై ఉన్న నమ్మకం, అవుట్పుట్ పట్ల ఉన్న విశ్వాసం స్పష్టంగా కనిపించింది.