కింగ్డమ్‌ ఓటీటీ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో క్రేజ్‌ ఉన్న హీరో విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన “కింగ్డమ్” సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్లి, విజయ్‌ కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం థియేటర్‌ ప్రదర్శన ముగింపు దశకు చేరుకుంటుండగా, ప్రేక్షకులు ఇప్పుడు దీని ఓటిటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్‌ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, “కింగ్డమ్” ఆగస్టు 28 లేదా 29 తేదీలలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ తేదీలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనిరుద్‌ ఈ సినిమాకు సంగీతం అందించగా, నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories