మాస్ జాతర టీజర్‌ ముహుర్తం ఫిక్స్‌ అయ్యింది!

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర”పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయని మాత్రాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో రవితేజ మళ్లీ శక్తివంతమైన రీతిలో రీ ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇప్పుడు రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్ర బృందం ఒక కీలక అప్డేట్‌ను అందించింది. ఆగస్టు 11న ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్‌లో రవితేజ మాస్ ఎనర్జీతో మెరిసిపోతున్నారు. టీజర్‌లో ఏముందో చూడాలని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మాణం చేపట్టాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories