కర్ణాటకలో కూలీ రికార్డుల వేట!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “కూలీ”పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉప్పొంగుతున్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగిపోతోంది. కేవలం తమిళ్‌లోనే కాకుండా కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రానికి బాగా క్రేజ్ నెలకొంది.

ఇక తాజాగా కర్ణాటకలో ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. అక్కడ ఒక్కసారిగా 66 షోలకు టికెట్లు బుకింగ్‌కి పెట్టగా, కేవలం 37 నిమిషాల్లోనే లక్ష టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ వేగం ఇప్పటి వరకు ఎవరూ సాధించని స్థాయిలో ఉంది. గతంలో కేజీఎఫ్ 2కి 80 షోలకు 45 నిమిషాలు పట్టగా, విజయ్ నటించిన లియో సినిమాకు 300 షోలకు 50 నిమిషాలు పట్టింది. కానీ కూలీ ఈ రెండింటినీ దాటేసి రికార్డు సాధించడం, సినిమా మీదున్న హైప్ ఎంత భారీగా ఉందో చెప్పేస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories