దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సె జంటగా వస్తున్న తాజా సినిమా ‘కాంత’ సినీప్రియుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాను పీరియాడిక్ కథాంశంతో రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై బజ్ పెంచేశాయి.
ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఈ టీజర్‌లో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథకీ తగిన ప్రెజెంటేషన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఇప్పుడే టీజర్ హంగామా తగ్గకముందే, మరో సర్ప్రైజ్‌తో మేకర్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘పసిమనసే’ అనే ఈ పాటను ఆగస్టు 9న సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఇది పూర్తిగా ప్రేమభరితమైన పాటగా ఉండబోతుందని చిత్రబృందం చెప్పింది.
ఈ రొమాంటిక్ ట్రాక్‌లో దుల్కర్, భాగ్యశ్రీల మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా ఉంది. వారి ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయమైతే, సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం మీద ఈ సినిమా సంగీతం, కథ, నటీనటుల పరంగా బలంగా ఉండబోతోందన్న అంచనాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.