న్యాచురల్ స్టార్ నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్’ ప్రకటించగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘దసరా’తో డైరెక్టర్‌గా సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి నానితో కలిసిహంగామా సృష్టించింది. మరింత పెద్ద స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ టాలీవుడ్‌లో మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.
ఇప్పటివరకు చూడని లుక్‌లో నానిని చూపించబోతున్నాడనే కారణంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. షూటింగ్ వేగంగా జరుగుతుండగా, చిత్ర బృందం ఒక కొత్త సర్‌ప్రైజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్టు, ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
ఆ పోస్టర్‌లో తుపాకులు, యాక్షన్ వాతావరణం నడుమ నాని ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడనే సంకేతాలు ఇచ్చారు. తుపాకుల ఆధిపత్యం ఉన్న ప్రదేశంలో అతను ఎలా ఎదుగుతాడు, ఆ రాజ్యంలో ఏ స్థాయికి చేరుకుంటాడు అనే ఉత్కంఠ కలిగించేలా డిజైన్ చేశారు. ఈ ప్రీ-లుక్‌తోనే సినిమా మీద మరింత బజ్ పెరిగింది.
ఈ చిత్రంలో రాఘవ్ జుయాల్, సోనాలీ కులకర్ణి వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.