చిరు – అనీల్ ప్రాజెక్ట్ టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో, దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కి మంచి హైప్ ఏర్పడింది. మెగాస్టార్ కెరీర్‌లో 157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. అనీల్ రావిపూడి తన స్టైల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టగా, ఇప్పుడు టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌కు సంబంధించిన తాజా వార్త బయటకు వచ్చింది.

సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 22న, అంటే చిరంజీవి జన్మదినం సందర్భంగా విడుదల చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. అభిమానుల హృదయానికి దగ్గరయ్యే శక్తివంతమైన టైటిల్‌ను అనీల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ఏమిటో తెలుసుకోవాలంటే ఇంకో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని భీమ్స్ అందిస్తున్నారు. సాహు గారపాటి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అభిమానుల కోసం మెగాస్టార్ బర్త్‌డే రోజున స్పెషల్ గిఫ్ట్‌గా ఈ అప్‌డేట్ రాబోతోంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories