మంచు కుటుంబం నుంచి ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భైరవం, కన్నప్ప అనే పేరుతో వచ్చిన ఈ చిత్రాల తరువాత మంచు విష్ణు తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ మంచు మనోజ్ మాత్రం కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించాడు. అతను చేయబోతున్న ఈ భారీ పీరియడ్ డ్రామాకు డేవిడ్ రెడ్డి అని పేరును అనౌన్స్ చేసినట్లు తెలిపాడు.
తన 21 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇది 21వ సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని మనోజ్ చెబుతున్నాడు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో తెరకెక్కనుంది. కథ 1897 నుంచి 1922 మధ్యకాలం లో జరిగే సంఘటనలపై ఆధారపడి ఉండనుందని మేకర్స్ తెలిపారు.
వెల్వెట్ సోల్, టూర్ రాడిక్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిగతా నటీనటులు మరియు ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ భారీ పీరియడ్ డ్రామా ఎలా రూపుదిద్దుకుంటుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.