‘పెద్ది’లో ప్రముఖ ఫోక్ సాంగ్ రీమిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా “పెద్ది” గురించి అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి గ్లింప్స్‌తోనే మంచి బజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతోంది.

ఈ నేపథ్యంలో అక్కడి స్థానిక సంస్కృతిని ప్రేక్షకులకు వినూత్నంగా చూపించేందుకు దర్శకుడు బుచ్చిబాబు విశేషంగా శ్రమిస్తున్నాడని టాక్. గతంలో రంగస్థలం సినిమాలో జిగేలు రాణి పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అదేలా ఇప్పుడు పెద్ది సినిమాకు ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ రూపంలో హైలైట్ ఇవ్వాలని టీం ప్లాన్ చేస్తుందట.

అందిన సమాచారం ప్రకారం, శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ పాపులర్ జానపద పాట “మా ఊరి ప్రెసిడెంటు”ను రీడిజైన్ చేసి సినిమాకు తగినట్టుగా అద్భుతంగా రీమిక్స్ చేశారట. ఈ పాటను పాపులర్ ఫోక్ సింగర్ పెంచల్ దాస్ ఆలపించినట్టు సమాచారం. ఆయనకు “రెడ్డమ్మ తల్లి” పాటతో గుర్తింపు వచ్చిందన్న విషయం తెలిసిందే.

ఈ ఫోక్ సాంగ్‌కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారని చెబుతున్న ఈ వార్త ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర ఫోక్ టచ్‌తో రెహమాన్ మ్యాజిక్ కలిసితే ఆ పాట ఎలాంటి ఫీల్ ఇస్తుందో ఊహించడమే కష్టం. సినిమా ఫుల్ రన్‌కు ఇది పెద్ద ప్లస్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories