హొంబలే ఫిలింస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన యానిమేషన్ డివోషనల్ మూవీ ‘మహావతార్ నరసింహ’ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా యానిమేషన్ సినిమాలకు పరిమిత మార్కెట్ ఉంటుందని అనిపించినా, ఈ సినిమాకు మాత్రం విభిన్న స్పందన లభిస్తోంది. పౌరాణిక అంశాలను ఆధునిక టెక్నాలజీతో కలిపి వినూత్నంగా చూపించడంతో ప్రేక్షకులు థియేటర్లవైపు పరుగులు పెడుతున్నారు.
ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలోనూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో కలిపి చేసిన ఓ క్రాస్‌ఓవర్ ఎడిట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ ఎడిట్‌లో ‘మహావతార్ నరసింహ’లోని కొన్ని ముఖ్య సన్నివేశాలను, ‘సలార్’ చిత్రంలోని పవర్‌ఫుల్ విజువల్స్‌తో కలిపి చూపించారు. ఇది చూసిన ప్రభాస్ స్వయంగా ఆకర్షితుడయ్యాడని, మేకర్స్ చెబుతున్నారు.
ఈ క్రాస్‌ఓవర్ వీడియోను సలార్ టీమ్ తమ అధికారిక సోషల్ మీడియా పేజ్ మీద షేర్ చేయడంతో, అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ వీడియోపై రియాక్ట్ అవుతూ రెబల్ ఫ్యాన్స్ ఎడిటింగ్ కి క్లాప్ కొడుతున్నారు. ‘ఇలాంటి ఐడియా రావాలంటే ఊహాశక్తి కావాలి’ అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఈ విధంగా ‘మహావతార్ నరసింహ’ సినిమాకు ఒక్కథియేటర్ రేంజ్‌కే కాదు, సోషల్ మీడియాలోనూ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది యానిమేషన్ సినిమాల మీద ఉన్న నమ్మకాన్ని పెంచడమే కాకుండా, డిజిటల్ ఎడిట్స్ ద్వారా ఇంకొన్ని క్రియేటివ్ కంటెంట్‌కి దారి తీసేలా ఉంది.