‘జగన్ ఓ అవినీతి శాస్త్రవేత్త’ అన్నదెవరంటే..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి, ప్రజాధనాన్ని దోపిడీ చేయడంలో ఆయన తెలివితేటల గురించి నైపుణ్యాల గురించి.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా విమర్శలు చేస్తే.. బహుశా తటస్థులు ఖాతరు చేయకపోవచ్చు. వారి రాజకీయ లబ్ధి కోసం ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కానీ.. జగన్ తప్పులను ఎత్తిచూపించడం వలన.. ఎలాంటి రాజకీయ ప్రయోజనమూ లేని వారు కూడా.. జగన్ ద్రోహాలు, దుర్బుద్ధుల గురించి మాట్లాడితే మాత్రం ఆలోచించాల్సిందే. జగన్ అవినీతి గురించి పదునైన విమర్శలు చేయడంలో.. కూటమి పార్టీల నాయకులైనా ఏమైనా మొహమాటపడుతున్నారేమో గానీ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారా ఇన్చార్జి మాణికం ఠాగూర్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆయన ఏకంగా.. వైసీపీ అధినేత జగన్ ఓ అవినీతి శాస్త్రవేత్త అని అంటున్నారు. అవినీతి చేయడంలో జగన్ నైపుణ్యాలను, సృజనాత్మక తెలివితేగలను మాణికం ఠాగూర్ ఘాటుగా ఆడుకుంటున్నారు.

జగన్ ను అవినీతి పరుడిగా ప్రొజెక్టు చేయడం వలన ఇప్పటికిప్పుడు కాంగ్రెసు పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీలేదు. కానీ.. జగన్ గురించి చెప్పుకోవాలంటే.. ఆయనకు ఆ భావం తప్పితే మరొకటి కలిగినట్టు లేదు. గమనిస్తే మాణికం ఠాగూర్ మాటలు నిజమే. జగన్మోహన్ రెడ్డి ఒక శాస్త్రవేత్త లాగా ఎలా అవినీతి చేయవచ్చుననే విషయంలో కొత్త పద్ధతులను కనుగొన్నారు. కొత్త మార్గాలను అన్వేషించారు.

మూడున్నర వేల కోట్ల రూపాయలను అడ్డంగా దోచేసిన లిక్కర్ కుంభకోణం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడెల్లా.. జగన్, సజ్జల రామక్రిష్ణారెడ్డి సహా ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్న మాటలను గమనిస్తే మనకు  ఇదే సంగతి అర్థమవుతుంది. వారు చెబుతున్న సంగతి ఒక్కటే.. ప్రభుత్వ రంగంలో ఉండే వ్యాపారాన్ని ప్రెరవేటు రంగానికి కట్టబెట్టడంలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉంటుందా? ప్రెవేటులో ఉన్నదానిని ప్రభుత్వ రంగంలోకి తీసుకువస్తే అవినీతి జరుగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. -ఈ లాజిక్ చాలా గొప్పది. ఎవ్వరికైనా సరే.. ఈ లాజిక్ చాలా సబబుగా అనిపిస్తుంది. ప్రభుత్వ వ్యాపారాన్ని ప్రెవేటు వాళ్ల చేతుల్లో పెట్టేసి, ప్రతిఫలంగా లంచాలు మెక్కడమే ఈ ఏడున్నర దశాబ్దాల భారతదేశ చరిత్రలో ప్రజలు గమనించారు. వైసీపీ నాయకులు తమ మాటలను మరో విధంగా కూడా సమర్థించుకుంటుంటారు. ఢిల్లీలో ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రెవేటుకు కట్టబెట్టడంలోనే కదా అవినీతి జరిగింది అని గుర్తుచేస్తున్నారు. అది కూడా నిజమే.

కానీ.. ప్రెవేటు రంగంలో ఉన్న వ్యాపారాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకువచ్చి ఎంత భారీగా దోచేయవచ్చునో ఒక కొత్త విధానాన్ని, దోపిడీ శాస్త్రాన్ని కనుగొన్న  వ్యక్తి జగన్. అన్ని తెలివితేటలు ఉన్నాయి గనుకనే.. అవినీతి శాస్త్రవేత్త జగన్ అనే మాట ను మాణికం ఠాగూర్ వాడుతున్నారు. ప్రజలందరూ కూడా నమ్మడానికి చాలా అనువుగా ఉందా మాట అని అనుకుంటున్నారు. ‘ఈ మద్యం ముడుపులతోనే సినిమాలు, ఆస్పత్రులు నిర్మించారని, షెల్ కంపెనీలు ఏర్పాటుచేశారని, మనీ లాండరింగ్ జరిగిందని’ మాణికం ఠాగూర్ అంటున్న దానికి వైసీపీ నేతలు అసలు రెస్నాన్స్ ఇస్తారో, లేదా, మౌనంగా ఆ శాస్త్రవేత్త బిరుదును స్వీకరిస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories