వరుణ్ పురుషోత్తం.. జగన్ కోటరీలో భూకంపం!

భూకంపం కాదు ఇది.. ధనకంపం అని చెప్పాలి! మూడున్నర వేల కోట్లరూపాయలను అక్రమంగా కాజేసిన వారు.. అందులో ఎన్నివేల కోట్లను బంగారంగా మార్చి ఎక్కడెక్కడ దాచుకున్నారో, ఎన్ని వేల కోట్ల రూపాయలను దేశం దాటించి రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులుగా మార్చారో.. ఎన్ని వేల కోట్ల రూపాయలను ఇంకా నగదురూపంలోనే చిన్న చిన్న మొత్తాలుగా వేర్వేరు డెన్ లలో, డంప్ లలో దాచిపెట్టారో లెక్క తెలిసిన వాళ్లు అతి కొద్ది మంది. సమగ్రంగా లెక్క తెలిసిన వారు.. విడివిడిగా కొన్ని భాగాలకు సంబంధించి లెక్క తెలిసిన వారు.. అంతా ఇప్పుడు రిమాండులో జైళ్లలోనే ఉన్నారు. వారెవ్వరూ ఇప్పటిదాకా నోరు తెరిచి అసలు సీక్రెట్ లు బయటపెట్టనేలేదు. ఇలాంటి తరుణంలో.. దుబాయ్ నుంచి వరుణ్ పురుషోత్తం విమానం దిగాడు. ఈ కేసులో 40వ నిందితుడు. విమానాశ్రయంలోనే అతను కాలుపెట్టడంతోనే జగన్ కోటరీలో భూకంపం.. కాదు కాదు, ధనకంపం వచ్చినట్టు అయింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించినప్పుడు.. తన నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు డబ్బును ఎక్కడెక్కడ దాచి ఉంచారో తనకు తెలిసిన డంప్ ల గురించి సమాచారం చెప్పేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాచారంలోని సులోచన ఫాంహౌస్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలు.. బొక్కిన డబ్బును కక్కించే సిట్ ప్రయత్నాలలో మొదటి అడుగు మాత్రమే. ఇంకా వందల వేల కోట్ల నగదునే రాబోయే రోజుల్లో ఈ నిందితుల నుంచి రాబట్టనున్నట్టుగా తెలుస్తోంది.

రాజ్ కెసిరెడ్డి వసూళ్ల నెట్ వర్క్ లో కీలకంగా వ్యవహరించిన వరుణ్ పురుషోత్తం పేరును మద్యం కుంభకోణంలో 40వ నిందితుడిగా చేర్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దుబాయి పారిపోయిన లిక్కర్ స్కాం నేరగాళ్లలో ఇతను కూడా ఒకడు. రెండు రోజుల కిందటే.. ఇలా, ఇప్పటికే పరారీలో ఉన్న 12 మందిని అరెస్టు చేయడానికి వీలుగా సిట్ పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ల తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ పురుషోత్తం దుబాయి నుంచి మంగళవారం హైదరాబాదుకు రావడం జరిగింది. ముందే సమాచారం ఉండడంతో అప్పటికప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. నేరాన్ని అంగీకరించిన పురుషోత్తం నగదు నిల్వల గురించి కీలక సమాచారం బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. సులోచన ఫాం హవుస్ తోపాటు మరికొన్ని చోట్ల కూడా సిట్ పోలీసులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.

వరుణ్ పురుషోత్తం పోలీసులకు పట్టుబడిన వెంటనే.. ఒక నగదు డంప్ గురించి వెల్లడించడం అనేది చిన్న విషయం కాదు. తాను నేరాన్ని ఒప్పుకుని జరిగినదేమిటో నిజాలు వెల్లడించడం మొదలయ్యాక.. ఆ నిజాల పరంపర పలానా చోట ఆగుతుందని చెప్పలేం. ఇప్పటికే కుంభకోణంలో కీలకమైన అనేక మంది వైసీపీ పెద్దల పేర్లను,  ముఖ్యనేత పాత్రను కూడా వరుణ్ పురుషోత్తం వెల్లడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దోచుకుని, దాచుకున్న డబ్బు లో చాలా వరకు ఇప్పుడు పోలీసులకు దొరికిపోవడం మాత్రమే కాదు.. అంతకు మించిన భూకంపం పార్టీలో పుట్టబోతున్నదని.. వరుణ్ పురుషోత్తం అప్రూవర్ గా మారితే.. అనేకమంది పార్టీ పెద్దతలకాయలు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories